logo

ప్రతి రైలులో సాధారణ భోగీలను ఐదుకు పెంచాలి


ప్రధానమంత్రి దివ్య సన్నిధికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల గాంధేయ మార్గంలో విజ్ఞప్తి*...... *రైలులో ఐదు సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్*. *దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా విజయనగరం RK డిగ్రీ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తరాల కార్యక్రమం ప్రారంభం* -
ప్రతి రైలులో సాధారణ భోగీ ల సంఖ్యను ఐదుకు పెంచాలని ఐదు సాధారణ భోగీల సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సాధన సమితి జాతీయ కన్వీనర్ తెలంగాణ వాసి, జాతీయఅవార్డు గ్రహీత-డాక్టర్ పరికిపండ్ల అశోక్ దేశవ్యాప్త ఉద్యమ కార్యక్రమములో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఉత్తరాల కార్యక్రమం విజయనగరం జిల్లా కేంద్రంలో విశ్రాంత బ్యాంకు అధికారి తాటిచెర్ల పరమహంస అధ్యక్షతన కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని ఆర్కే డిగ్రీ కాలేజీ సెమినార్ హాలులోనిర్వహించారు. ఐదు సాధారణ భోగీల సాధన కోసం ప్రధానమంత్రికి దేశవ్యాప్తంగా కోటి ఉత్తరాల గాంధీ మార్గంలో ఉద్యమాన్ని వివిధ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యం చేస్తూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నట్లు అనధికార అంచనా ఉండగా, ఈ ప్రయాణంలో జనరల్ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఆగమ్య గోచరంగా ఉంటుందని,సీట్లు తక్కువగా ఉండటం,బోగీల్లో స్థలం లేకపోవడం, తొక్కిసలాటలు, గాయాలు, కొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలై చిన్నారుల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అశోక్ పరికిపండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా - టు, ది ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, 152 సౌత్ బ్లాక్, రైసినా హిల్స్ ,న్యూఢిల్లీ-110011. చిరునామాకు మన బాధను, డిమాండ్ ను అభిప్రాయాల్ని తెలుపుతూ ఉత్తరం రాసి పంపాలని కోరారు. వివరాలకు 9989310141 లలో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, ఉపాధ్యాయ బృందం విజ్జి, రామ లీల,విద్యార్థిని విద్యార్థులు ఉత్తరాలు రాసి పోస్ట్ డబ్బాలో వేశారు. 9989310141

23
3130 views